167 children rescued | 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలింపు.. రక్షించిన పోలీసులు
167 children rescued | సుమారు 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. వందలాది మంది బాలురను రక్షించారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు.
భోపాల్: సుమారు 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. వందలాది మంది బాలురను రక్షించారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు. (167 children rescued) బీహార్లోని అరేరియా ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని లాతూర్కు పనుల కోసం వందలాది మంది పిల్లలను పాట్నా-పూర్ణ ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లు పిల్లల సంక్షేమ కమిటీ సమాచారం ఇచ్చింది. దీంతో రైల్వే, ప్రభుత్వ పోలీసులు అప్రమత్తమయ్యారు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్లోని కట్ని రైల్వే స్టేషన్కు ఆ రైలు చేరుకున్నది. దీంతో ఐదో నంబర్ ఫ్లాట్ఫామ్పై వేచి ఉన్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. ఆరు నుంచి 13 ఏళ్ల వయస్సున్న 167 మంది బాలురను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన టిక్కెట్లు, పత్రాలు లేకపోవంతో ఆ పిల్లలను తీసుకెళ్తున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
మరోవైపు రైలు నుంచి రక్షించిన 167 మంది బాలుర వయస్సు, గుర్తింపు, ప్రయాణం గురించి పోలీసులు తెలుసుకున్నారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు. దీంతో కొంత మంది పిల్లలను కట్నీ, మరికొందరిని జబల్పూర్లోని బాలల సంరక్షణ కేంద్రాలకు తరలించారు. వారి తల్లిదండ్రులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే రక్షించిన పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.
Also Read:
Road Accident | రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి.. 30 మందికిపైగా గాయాలు
Girl Consumes Poison After Rape | బంధువు అత్యాచారం.. విషం తాగి బాలిక మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Boys
- Katni
- labour work
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

