IAS Officer Cheats Man | దివ్యాంగ వ్యక్తిని రూ.95 లక్షలకు మోసగించిన ఐఏఎస్ అధికారిణి.. చంపుతానంటూ బెదిరింపులు
IAS Officer Cheats Man | ఒక ఐఏఎస్ అధికారిణి దివ్యాంగుడైన వ్యక్తిని మోసగించింది. భూమి ఇప్పిస్తానని నమ్మించి రూ.95 లక్షలు కాజేసింది. ఆ డబ్బు అడిగిన ఆ వ్యక్తిని చంపుతానని బెదిరించింది. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భువనేశ్వర్: ఒక ఐఏఎస్ అధికారిణి దివ్యాంగుడైన వ్యక్తిని మోసగించింది. భూమి ఇప్పిస్తానని నమ్మించి రూ.95 లక్షలు కాజేసింది. ఆ డబ్బు అడిగిన ఆ వ్యక్తిని చంపుతానని బెదిరించింది. అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (IAS Officer Cheats Man) ఒడిశాలోని కటక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఐఏఎస్ అధికారిణి ఆరాధన దాస్, ఒడిశా హోం శాఖలో అదనపు కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నది. కటక్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ) ప్రాంతంలో భూమి ఇప్పిస్తానని దివ్యాంగుడైన కమల్ కుమార్ భావ్సింకాను ఆమె నమ్మించింది. అతడి నుంచి రూ.95 లక్షలు తీసుకున్నది. కమల కుమార్ భార్య బీనా తన బ్యాంకు ఖాతాల ద్వారా రెండు వేర్వేరు తేదీల్లో డబ్బును ఆమెకు బదిలీ చేశారు.
కాగా, దివ్యాంగుడైన కమల్ కుమార్ను ఐఏఎస్ అధికారిణి ఆరాధన దాస్ మోసగించింది. రూ.95 లక్షలు తీసుకున్న ఆమె ఆ భూమిని అప్పగించలేదు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని కమల్ అడగ్గా చంపుతానని బెదిరించింది. ఈ నేపథ్యంలో సీడీఏ ఫేజ్-2 పోలీస్ స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. భూమి ఇప్పించే వాగ్దానానికి సంబంధించి రూ. 95 లక్షల లావాదేవీ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. కొంత డబ్బు నగదు రూపంలో కూడా చెల్లించినట్లు నిరూపణ అయ్యింది.
మరోవైపు ఐఏఎస్ అధికారిణి ఆరాధన దాస్ ఈ మోసం కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ ఐఏఎస్ అధికారిణిపై అధికారిక చర్యల కోసం అనుమతి కోరుతూ రాష్ట్ర హోం శాఖ, సాధారణ పరిపాలన శాఖ (జిఏడి)కు పోలీస్ కమిషనరేట్ లేఖ రాసింది. ఐఏఎస్ అధికారిణి ఆరాధన దాస్ గతంలో భూమి, గృహనిర్మాణ రంగానికి సంబంధించిన పదవులతో సహా వివిధ విభాగాలలో ఉన్నత పదవులు నిర్వహించారు.
Also Read:
Nitish Kumar | ముఖ్యమంత్రి నివాసం నుంచి.. నితీశ్ కుమార్ వస్తువులు తరలింపు
Girl Consumes Poison After Rape | బంధువు అత్యాచారం.. విషం తాగి బాలిక మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

