విద్యుత్ స్తంభాల కొరత… సుందరయ్యనగర్లో అంధకారం
విద్యుత్ స్తంభాల కొరతతో సుందరయ్యనగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రయితే సుందరయ్యనగర్ కాలనీ అంధకారమయంగా మారుతుందని, వీధి దీపాలు ఏర్పాటు చేసి కాలనీలో వెలుగులు నింపాలని స్థానికులు సంబంధిత పంచాయతీ, విద్యుత్ శాఖ...
బూర్గంపహాడ్, ఆగస్టు 07 : విద్యుత్ స్తంభాల కొరతతో సుందరయ్యనగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రయితే సుందరయ్యనగర్ కాలనీ అంధకారమయంగా మారుతుందని, వీధి దీపాలు ఏర్పాటు చేసి కాలనీలో వెలుగులు నింపాలని స్థానికులు సంబంధిత పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. షిరిడీ సాయిబాబా ఆలయం నుండి మల్లి కృష్ణ ఇంటి వరకు ఒక్క స్తంభం కూడా లేకపోవడంతో కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు 20 నుంచి 30 కనెక్షన్లు ఇవ్వడంతో షార్ట్ సర్కూట్ జరిగి ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోతున్నాయని కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు.
ఇటీవల గోదావరి 56 అడుగులకు చేరి వరదలు రావడంతో జామాయిల్ తోటలు, సమీప పొలాల నుంచి విష సర్పాలు, ఇతర కీటకాలు కాలనీలోని ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ కాలనీలో వెళ్లాలంటే ఎటు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని కాలనీవాసులు భయపడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ, విద్యుత్ శాఖలు స్పందించి సుందరయ్యనగర్లో తక్షణమే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి వీధి దీపాలు అమర్చాలని కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

