Woman Killed Son Over Affair | ప్రియుడితో కలిసి కుమారుడ్ని హత్య చేసిన తల్లి.. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే యత్నం
Woman Killed Son Over Affair | తమ సంబంధానికి అడ్డుగా భావించిన తల్లి తన కుమారుడి హత్య కోసం ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. వారిద్దరూ కలిసి బాలుడి తలను నీటి బకెట్లో ముంచి చంపారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అయితే అసలుగుట్టు రట్టయ్యింది.
ముంబై: తమ సంబంధానికి అడ్డుగా భావించిన తల్లి తన కుమారుడి హత్య కోసం ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. వారిద్దరూ కలిసి బాలుడి తలను నీటి బకెట్లో ముంచి చంపారు. గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అయితే అసలుగుట్టు రట్టయ్యింది. (Woman Killed Son Over Affair) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖేడ్ ప్రాంతంలో నివసిస్తున్న 27 ఏళ్ల బసిరన్ మెహబూబ్ షేక్ పదేళ్ల కిందట భర్త మెహబూబ్ నుంచి విడిపోయింది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు తండ్రితో కలిసి ఉంటుండగా, ఆరేళ్ల కుమారుడు అవేజ్ మాత్రం తల్లి సంరక్షణలో ఉన్నాడు.
కాగా, భర్త స్నేహితుడైన రామ్ వినాయక్ కాజేవాడ్, బసిరన్ మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే ఆరేళ్ల కుమారుడైన అవేజ్ తమ సంబంధానికి అడ్డుగా ఉండటంతో ఆ బాలుడ్ని హత్య చేయాలని ప్లాన్ వేశారు. ఏప్రిల్ 4న రాత్రి 11:30 గంటల సమయంలో అవేజ్ తలను బకెట్లోని నీటిలో ముంచి చంపారు. ఆ బాలుడు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి అతడి శరీరాన్ని నేలకేసి బాదారు.
మరోవైపు కుమారుడి హత్య తర్వాత అవేజ్ మృతదేహాన్ని బీడ్లో ఉన్న తన పుట్టింటికి బసిరన్ తరలించింది. తన కొడుకు గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది.
అయితే బాలుడి అంత్యక్రియల కోసం తండ్రి తరుఫు తాత ఆ ఇంటికి వెళ్లాడు. అవేజ్ మృతదేహంపై గాయాల గుర్తులను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలుడి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా హత్యగా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో బాలుడి తల్లి బసిరన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు రామ్ వినాయక్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Also Read:
Girl Consumes Poison After Rape | బంధువు అత్యాచారం.. విషం తాగి బాలిక మృతి
Hostel Boy Murder | హాస్టల్లో బాలుడిపై అసహజ లైంగిక దాడి, హత్య.. గార్డ్ అరెస్ట్
Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- affair
- arrested
- drowns
- heart attack
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

