Hostel Boy Murder | హాస్టల్లో బాలుడిపై అసహజ లైంగిక దాడి, హత్య.. గార్డ్ అరెస్ట్
Hostel Boy Murder | రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఒక బాలుడిపై అసహజ లైంగిక దాడి జరిగింది. ఆ తర్వాత దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడి హత్యపై పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన హాస్టల్ గార్డ్‌ను అరెస్ట్ చేశారు.
పాట్నా: రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఒక బాలుడిపై అసహజ లైంగిక దాడి జరిగింది. ఆ తర్వాత దారుణ హత్యకు గురయ్యాడు. (Hostel Boy Murder) బాలుడి హత్యపై పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన హాస్టల్ గార్డ్‌ను అరెస్ట్ చేశారు. బీహార్‌లోని జెహానాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో ఉంటున్న ఐదేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మరణించాడు. ఏప్రిల్ 6న అతడ్ని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు బాలుడి తండ్రికి హాస్టల్ నిర్వాహకుడు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.
కాగా, కుమారుడి గొంతు, ప్రైవేట్ భాగం. పొత్తికడుపు ఎడమ వైపు కోసిన గాయాలు ఉండటాన్ని బాలుడి తండ్రి గమనించాడు. ఆసుపత్రి డాక్టర్ల సూచన మేరకు పాట్నాలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు అతడ్ని తరలించారు. అయితే ఆ బాలుడు మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
మరోవైపు బాలుడి తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టారు. హాస్టల్ నిర్వాహకుడు తరుణ్ కుమార్, ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. స్కూల్ క్యాంటీన్ గార్డ్ అయిన 46 ఏళ్ల ముఖేష్ అలియాస్ సుదామాపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాల మేరకు అతడ్ని అదుపులోకి తీసుకుని పశ్నించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.
కాగా, ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి ముఖేష్ ఆ బాలుడ్ని తన గదిలోకి పిలిచాడని, అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీస్ అధికారి తెలిపారు. ఆ బాలుడు తనను అరెస్ట్ చేయిస్తాడనే భయంతో బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడని, మృతదేహాన్ని హాస్టల్ మెట్లపై పడేశాడని చెప్పారు. నిందితుడు ముఖేష్‌ను అరెస్ట్ చేశామని, హత్యకు వినియోగించిన బ్లేడ్‌ను అతడి గది నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
అయితే చాలా కాలం కిందట ముఖేష్ భార్య అతడ్ని విడిచిపెట్టి వెళ్లిపోయినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో హాస్టల్లోని పిల్లలు ‘నపుంసకుడు’ అని అతడ్ని అని ఎగతాళి చేసేవారని చెప్పారు. హాస్టల్ నిర్వాహకుడితో కూడా నిందితుడు ముఖేష్ గొడవ పడ్డాడని, ఈ సందర్భంగా హాస్టల్‌కు చెడ్డపేరు తెస్తానని, దానిని మూసివేయిస్తానని అతడు బెదిరించినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Boy Killed In Bee Attack | పరీక్షకు హాజరైన విద్యార్థులు.. తేనెటీగల దాడి, బాలుడు మృతి
Woman killed in PG | పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో మహిళ హత్య.. బెడ్ బాక్స్‌లో మృతదేహం
Watch: న్యాయవాదిని కాల్చి చంపిన దుండగులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

