Bus Crashes Into Truck | రాజస్థాన్ (Rajasthan)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దౌసా (Dausa) జిల్లాలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
బస్సు 45 మంది ప్రయాణికులతో ఉజ్జయిని నుంచి ఢిల్లీకి వెళ్తోంది. ఈ క్రమంలో దౌసా జిల్లాలోకి రాగానే బస్సు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది (Bus Crashes Into Truck). ఈ ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దట్టమైన పొగ మంచు (Dense Fog) కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Couple Suicide | విశాఖలో విషాదం..ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
America | కొత్త ఏడాది వేళ ఉలిక్కిపడ్డ అమెరికా.. నిన్న ట్రక్కు బీభత్సం.. ఇవాళ పేలుడు, కాల్పులు
Chinmoy Krishna Das: చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాకరించిన బంగ్లాదేశ్ కోర్టు