America | కొత్త ఏడాది వేళ వరుస ప్రమాదాలతో అగ్రరాజ్యం అమెరికా (America) వణికిపోయింది. ఇప్పటికే న్యూ ఓవర్లీన్స్లో పికప్ ట్రక్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ ఘటన మరవకముందే మరో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.
టెస్లా సైబర్ ట్రక్కు పేలుడు..
లాస్ వేగాస్ (Las Vegas)లో పేలుడు సంభవించింది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వద్ద భారీ పేలుడు చోటు చేసుకుంది. హోటల్ వెలుపల ఉన్న టెస్లా సైబర్ ట్రక్కు కారులో ఈ పేలుడు (Tesla Cybertruck blast) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఏడుగురు గాయపడ్డారు. న్యూ ఓవర్లీన్స్లో ట్రక్ బీభత్సం సృష్టించిన గంటల వ్యవధిలోనే ఈపేలుడు సంభవిండచం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు ఘటనలకు లింక్ ఉందని.. ఉగ్రవాద చర్యగా అనిపిస్తోందని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు.
న్యూయార్క్ నైట్ క్లబ్లో కాల్పులు..
ఇక బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్ క్లబ్లో (New York nightclub) కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. క్వీన్స్ కౌంటీకి చెందిన అమజురా నైట్‌క్లబ్‌లో చోటు చేసుకున్న ఈ కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. దీని వెనుక ఇద్దరు దుండుగులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్త ఏడాది వేళ వరుస ఘటనలతో అమెరికా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Pickup Truck | న్యూఇయర్ వేడుకల్లో ట్రక్కు బీభత్సం.. 15కు చేరిన మృతులు
H1 B Visa | మాకు విదేశీ నిపుణులు అక్కర్లేదు.. హెచ్1బీ వీసాపై అమెరికన్ల మనోగతం!
US – Terror Attack | అమెరికాలో నూతన సంవత్సర వేడుకలపై ఉగ్ర దాడి కలకలం.. పది మంది మృతి