US – Terror Attack | అమెరికాలో నూతన సంవత్సర వేడుకలపై ఉగ్ర దాడి కలకలం.. పది మంది మృతి
US - Terror Attack | అమెరికాలోని లుసియానా రాష్ట్రం న్యూ ఓర్లియాన్స్ లో ఉగ్రదాడి కలకలం రేపింది. నూతన సంవత్సర సంబురాల్లో తలమునకలైన వారి మీదుగా ఓ వ్యక్తి ట్రక్ నడుపుతూ కాల్పులు జరుపుతూ దూసుకెళ్లాడు.
US – Terror Attack | యావత్ ప్రపంచం కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే అగ్ర రాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. అమెరికాలోని లుసియానా రాష్ట్రం న్యూ ఓర్లియాన్స్లో బుధవారం తెల్లవారుజామున 3.15 గంటలకు ఉగ్రదాడి జరిగింది. వైట్ పికప్ ట్రక్‌లో వెళుతున్న వ్యక్తి బ్యారికేడ్ల మీదుగా దూసుకెళ్లాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుతున్న బౌర్బోన్ స్ట్రీట్‌లో భారీగా గుమిగూడిన ప్రజల మీదుగా ట్రక్ నడిపించాడు. దీంతో పది మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయని న్యూ ఓర్లియాన్స్, ఫెడరల్ పోలీసు అధికారులు తెలిపారు.
నిందితుడు శరవేగంతో ట్రక్ నడుపుతూ వెళ్లాడని, ప్రజలపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారికి రైఫిల్ తో కాల్చి చంపాడని చెప్పారు. ఈ ఘటనను న్యూ ఓర్లియాన్స్ మేయర్ లాటోయా కాంట్రెల్ ‘ఉగ్రవాద దాడి’ అని చెప్పారు. దీనిపై ఎఫ్‌బీఐ పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ దాడిలో గాయపడిన 30 మంది క్షతగారులను సమీప దవాఖానలకు తరలించామని న్యూ ఓర్లియన్స్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

