Chinmoy Krishna Das: చిన్మయ్ కృష్ణ దాస్‌కు బెయిల్ నిరాకరించిన బంగ్లాదేశ్ కోర్టు
Chinmoy Krishna Das: ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాకరించింది. చిట్టగ్రామ్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి మహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి(Chinmoy Krishna Das)కి బెయిల్ నిరాకరించారు. చిట్టగ్రామ్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి మహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇరు పక్షాల నుంచి సుమారు 30 నిమిషాల పాటు వాదనలు విన్న తర్వాత ఆయన తీర్పు వెలువరించారు. బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేసుకోనున్నట్లు చిన్మయ్ తరపు న్యాయవాది అపూర్వ కుమార్ భట్టాచార్జీ తెలిపారు.
అపూర్వ నేతృత్వంలోని సుమారు 11 మంది సుప్రీంకోర్టు లాయర్లు.. ఇవాళ మెట్రోపాలిటన్ కోర్టుకు వెళ్లారు. న్యాయ బృందం తమ వాదనలను బలంగానే వినిపించినా.. కోర్టు మాత్రం చిన్మయ్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నవంబర్ 25వ తేదీన చిన్మయ్ కృష్ణ దాస్‌పై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ఆయన్ను హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

