అమరావతి : ఆర్థిక ఇబ్బందుల కారణంగా విశాఖలో దంపతులు ఆత్మహత్యకు( Couple Suicide) పాల్పడ్డారు. జిల్లాలోని పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో గత కొన్నేళ్లుగా నివాసముంటున్న దంపతులు సంతోష్ , ఉమ ఆర్థిక ఇబ్బందులను (Financial Problems) ఎదుర్కొంటున్నారు. వాటిని తీర్చేందుకు స్థోమత లేకపోవడంతో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వారి ఇంటిపక్కన ఉండే స్థానికులు గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. దంపతుల మృతికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.