మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 12:27:19

మూడేండ్ల చిన్నారిపై 12 ఏండ్ల‌ బాలుడి అఘాయిత్యం

మూడేండ్ల చిన్నారిపై 12 ఏండ్ల‌ బాలుడి అఘాయిత్యం

జంషెడ్‌పూర్‌: అత‌నికి ఇంకా నిండా 12 ఏండ్లు కూడా నిండ‌లేదు. అయితేనేం.. ఓ మూడేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. వారం రోజుల క్రితం జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భం జిల్లాలో జ‌రిగిన ఈ‌ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకివ‌చ్చింది. జిల్లాలోని ప‌ర్సుఢి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న లోకో కాల‌నీలో బాధిత‌ చిన్నారి కుటుంబం కిరాయికి ఉంటున్న‌ది. న‌వంబ‌ర్ 4న ఆ చిన్నారి త‌న ఇంటిముందు ఒంట‌రిగా ఆడుకుంటున్న‌ది. అది గ‌మనించిన ప‌క్కింటి కుర్రాడు ఆ బాలిక‌ను త‌న ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఈ మేర‌కు బాధితురాలి త‌ల్లిదండ్రులు స్థానిక పోలీసుల‌కు శ‌నివారం ఫిర్యాదు చేశారు. నిందితుడు, అత‌ని తండ్రి ప‌రారీలో ఉన్నార‌ని, దీంతో వారిద్ద‌రి కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి తండ్రి ఊర్లో లేక‌పోవ‌డంతోనే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డానికి ఆల‌స్య‌మ‌య్యింద‌ని చెప్పారు. కాగా, ఆ బాలుడు, అత‌ని తండ్రిపై కేసు న‌మోదు చేశామని వెల్ల‌డించారు.