Soldiers | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్ల (Soldiers)తో వెళ్తున్న బస్సు కారును బలంగా ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో సియోని (Seoni) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 35వ బెటాలియన్‌కు చెందిన 26 మంది ప్రత్యేక సాయుధ దళాలతో (Special Armed Forces jawans) ఓ బస్సు మండ్లా నుంచి చింద్వారాకు వెళ్తోంది. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో సియోని-మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ గ్రామ సమీపంలోకి రాగానే బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి కారును బలంగా ఢీ కొట్టింది. అనంతరం రోడ్డుపక్కకు బోల్తాపడింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఘనటాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు కన్హయ్య జస్వానీ (75), నిక్లేష్ జస్వానీ (45), డ్రైవర్ పురుషోత్తం మహోబియా (37)గా గుర్తించారు. మరో ఇద్దరిని కియోలారి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా నాగ్‌పూర్ నుంచి వస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ ఘటనలో బస్సులోని 26 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిని కూడా కియోలారి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఓ జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన్ని మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Also Read..
Lakshadweep | మోదీ పర్యటనతో లక్షద్వీప్‌కు పర్యాటకులు పెరిగారు : టూరిజం అధికారి ఇంతియాజ్
Manda Krishna | మరోసారి మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ధ్వజమెత్తిన మందకృష్ణ మాదిగ
PM Modi: ముస్లిం లీగ్ ఐడియాలజీ తరహాలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో: ప్రధాని మోదీ