Road Accident | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. ఓ వాహనం అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
చంబా (Chamba) జిల్లాలోని చురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చంబాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం చురా ప్రాంతంలోకి రాగానే అదుపుతప్పి 200 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం టిస్సాలోని సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చంబా మెడికల్ కాలేజీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను రాజింద్ కుమార్ (డ్రైవర్), పుమ్మీ కుమార్, సచిన్‌గా గుర్తించారు. గాయపడిన ఇద్దరిని అమర్ సింగ్, దమర్ సింగ్‌గా గుర్తించారు.
Also Read..
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయానికి రూ.3,000 కోట్ల విరాళాలు
Air Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు కాలుష్యం.. వెరీ పూర్ కేటగిరీలో ఏక్యూఐ
Hit And Run | షాకింగ్.. మద్యం మత్తులో బైక్‌ను ఢీ కొట్టి.. కిలోమీటరుమేర ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్