Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీలో (very poor category) నమోదైంది. గురువారం ఉదయం నగరంలో ఓవరాల్ ఏక్యూఐ (AQI) 352గా ఉంది. వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల సమయానికి వివేక్ విహార్‌లో ఏక్యూఐ 415, ఆనంద్ విహార్‌లో 408గా నమోదైంది. అశోక్ విహార్‌లో 388, ఆయా నగర్లో 331, బావనలో 387, బురారి క్రాసింగ్ ప్రాంతంలో 369, ద్వారకా సెక్టార్-8లో 371, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్-3 వద్ద 320, ఐటీవో ప్రాంతంలో 370, లోధి రోడ్డులో 334, ముంద్కాలో 364, నజాఫ్‌గఢ్‌లో 338, నరేలా ప్రాంతంలో 371, పంజాబీ బాగ్ వద్ద 368, పట్పర్గంజ్లో 386, ఆర్కే పురం ప్రాంతంలో 374, సిరిఫోర్ట్‌లో 381గా ఏక్యూఐ నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వ్యక్తులు, వృద్ధులతోపాటూ చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కండ్ల మంటలు వంటి వాటికి గురవుతారని హెచ్చరిస్తున్నారు.
Also Read..
Hit And Run | షాకింగ్.. మద్యం మత్తులో బైక్‌ను ఢీ కొట్టి.. కిలోమీటరుమేర ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్
Donald Trump: అణ్వాయుధాలను పరీక్షించండి.. ట్రంప్ కీలక ఆదేశాలు
Bheemadevarapally | భీమదేవరపల్లిలో విషాదం.. కల్వర్టులో పడి వ్యక్తి మృతి