Hit And Run | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ బైక్‌ను ఢీ కొట్టాడు (Car Drags Biker). అనంతరం అలాగే కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లాడు (Hit And Run). ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జాతీయ రహదారి 48లోని మోడసా లునావాడ రోడ్డు (Modasa Lunawada Road)లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మనీష్ పటేల్ అనే వ్యక్తి తన సోదరుడు మెహుల్ పటేల్‌తో కలిసి కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో వారిద్దరూ ఫుల్‌గా మద్యం సేవించారు. మద్యం మత్తులో అదే రూట్లో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టారు. అనంతరం దాదాపు 1.5 కిలోమీటర్ల మేర బైక్‌ను ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులోని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. కారులో మద్యం బాటిల్స్ ఉన్నట్లు గుర్తించ స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులు 50 ఏండ్ల దినేష్ భాయ్, 21 ఏండ్ల సునిల్గా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Donald Trump: అణ్వాయుధాలను పరీక్షించండి.. ట్రంప్ కీలక ఆదేశాలు
Vladimir Putin: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన పోసిడాన్ టార్పిడో పరీక్ష సక్సెస్: పుతిన్
Cyclone Montha | ఛత్తీస్‌గఢ్‌లోకి ప్రవేశించిన మొంథా తుఫాన్..