లక్నో: పాత బిల్డింగ్ కూలిపోయింది. (Building Collapses) ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మసాని పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ నగర్ ప్రాంతంలో బిల్డింగ్ కూలిపోయింది. సమీపంలోని ఇళ్లపై శిథిలాలు పడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. 45 ఏళ్ల వ్యక్తి, ఆరు, నాలుగేళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
కాగా, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఒక వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. శిథిలాలను పూర్తిగా తొలగించిన తర్వాత ఎంత మంది చిక్కుకున్నారు అన్నది తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఈ సంఘటనపై దర్యాప్తు చేపడతామని అన్నారు.
#WATCH | मथुरा, उत्तर प्रदेश: मसानी थाना क्षेत्र में एक इमारत ढह गई, राहत एवं बचाव कार्य जारी है। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/f2piEtJ3Kr
— ANI_HindiNews (@AHindinews) June 15, 2025
Also Read:
Watch: భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: అదుపుతప్పిన స్కార్పియో.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Carries Stillborn For 80 Km In Bag | మరణించిన శిశువును.. 80 కిలోమీటర్లు బ్యాగులో మోసిన వ్యక్తి