Road Accident | రాజస్థాన్ (Rajasthan)లో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రాజ్‌సమంద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు పది మందికిపైగా గాయాలపాలయ్యారు. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే (Driver Allegedly Falls Asleep)ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి రాజస్థాన్‌లోని భిల్వారాకు వెళ్తోంది. ఈ క్రమంలో రాజ్‌సమంద్ జిల్లా భవ బస్ స్టాండ్ సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆర్కే ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మృతులు ఛయన్పూర్కు చెందిన అఖిలేష్ (25), బీహార్‌కు చెందిన గీత (30), అసిఫ్ మొహమ్మద్ (27) గా గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Pakistani intruder | భారత్‌లో చొరబాటుకు పాకిస్థానీ యత్నం.. కాల్చిచంపిన భద్రతా బలగాలు
DGCA | విమానాల్లో విండో షేడ్స్‌ను తెరువొద్దు.. కమర్షియల్ ఫ్లైట్స్‌కు డీజీసీఏ కీలక సూచన
Man Arrested For Spying Pak | బీఎస్ఎఫ్, ఐఏఎఫ్ సమాచారం పాక్‌కు చేరవేత.. వ్యక్తి అరెస్ట్