Morning Walk | అస్సాం (Assam)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నడకకు (Morning Walk) వెళ్లిన ముగ్గురు మహిళలను రైలు ఢీ కొట్టింది (Women Hit By Train). ఈ ప్రమాదంలో వారు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలోని బామునిగావ్ రైల్వే స్టేషన్ (Bamunigaon Railway Station) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోకో గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు ఇవాళ ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతున్న సమయంలో పూరి ఎక్స్‌ప్రెస్ రైలు వారిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాధిత మహిళలను రూమి దాస్ (55), కొరాబి మాలు (60), ఉత్తర దాస్ (60)గా గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Rain Red Alert | రెయిన్ రెడ్ అలర్ట్.. బయటకు రావొద్దంటూ పోలీసులకు హెచ్చరికలు
Rahul Gandhi | ఓటరు జాబితా సవరణ ఓట్ల చోరీకి నూతన ఆయుధం: రాహుల్‌గాంధీ
Naveen Patnaik | ఆస్పత్రిలో చేరిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్.. వైద్యులు ఏమన్నారంటే..?