బుధవారం 03 జూన్ 2020
National - May 08, 2020 , 10:06:39

భారత్‌లో గత 24 గంటల్లో 103 మంది మృతి

భారత్‌లో గత 24 గంటల్లో 103 మంది మృతి

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 103 మృతి చెందగా, కొత్తగా 3,390 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు భారత్‌లో 56,342 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 1886కు చేరింది. ఈ వైరస్‌ నుంచి 16539 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 17,974 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 694 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 7,103, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409, రాజస్థాన్‌లో 3,453, మధ్యప్రదేశ్‌లో 3,252, ఉత్తరప్రదేశ్‌లో 3,071, ఏపీలో 1,833, పంజాబ్‌లో 1,644, వెస్ట్‌ బెంగాల్‌లో 1,548, తెలంగాణలో 1,122 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 


logo