ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురిని కాపాడిన హీరో పోలీస్ అధికారి ఆ రాష్ట్ర పోలీస్ బాస్ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్ (Sadanand Date)ను మహారాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. జనవరి 3న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ రష్మి శుక్లా స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు.
కాగా, 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి 59 ఏళ్ల సదానంద్ వసంత్ డేట్ దీనికి ముందు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఇటీవలే మహారాష్ట్ర కేడర్‌కు తిరిగి వచ్చారు. 2008లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్‌గా ఉన్న సదానంద్, ఉగ్రవాది కసబ్ నేతృత్వంలో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల్లో పలువురిని కాపాడారు. ఆయన వీరోచితానికి రాష్ట్రపతి పోలీసు పతకంతో సత్కరించారు.
మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ గతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఐజీగా, ముంబై సమీపంలోని మీరా-భయందర్, వాసాయి-విరార్ నగరాలకు పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. పూణే యూనివర్సిటీ నుంచి ఆర్థిక నేరాలలో ఆయన డాక్టరేట్ పొందారు.
Also Read:
Ex-Cop Dressed As Woman | మహిళ వేషంలో మాజీ పోలీస్.. అత్యాచార నిందితుడు అరెస్ట్
Watch: పోలీస్‌పై కత్తితో దాడికి వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?