Shiv Sena | మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం ? షిండే వర్గాన్ని వీడేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు!
Shiv Sena | మహారాష్ట్ర (Maharashtra) లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు (MLA), 9 మంది ఎంపీలు (MP) భారతీయ జనతా పార్టీ (BJP) పట్ల అసంతృప్తిగా ఉన్నారని శివసేన (యూబీటీ) పార్టీ (Shiv Sena (UBT) party) అధికారిక పత్రిక ‘సామ్నా’ (Saamana) పేర్కొంది.
Shiv Sena | మహారాష్ట్ర (Maharashtra) లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు (MLA), 9 మంది ఎంపీలు (MP) భారతీయ జనతా పార్టీ (BJP) పట్ల అసంతృప్తిగా ఉన్నారని శివసేన (యూబీటీ) పార్టీ (Shiv Sena (UBT) party) అధికారిక పత్రిక ‘సామ్నా’ (Saamana) పేర్కొంది. వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిపింది.
ఇదే విషయంపై ఠాక్రే వర్గం ఎంపీ వినాయక్ రౌత్ ( Vinayak Raut ) మాట్లాడుతూ.. పార్టీ వీడేందుకు సిద్ధపడ్డ శాసనసభ్యులు తమ పార్టీతో టచ్లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. వారి నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగనందున అసంతృప్తి చెందిన షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారని చెప్పారు.
కాగా, ఇటీవల శివసేన సీనియర్ నేత గజానన్ కీర్తికర్ బీజేపీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారని సామ్నా గుర్తు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగమైనప్పటికీ తమ పట్ల బీజేపీ వివక్ష చూపుతోందని కీర్తికర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కీర్తికర్ అసమ్మతి వ్యక్తం చేసిన కొద్ది రోజులకే బీజేపీ-శివసేన కూటమిలోని ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వినాయక్ రౌత్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
Bangalore | బెంగళూరులో పంక్చర్ మాఫియా ఆగడాలు.. రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్న ప్రజలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Eknath Shinde
- Saamana
- shiv sena
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

