Sakshi Malik | కనీసం కొంతమంది క్రీడాకారులకైనా గౌరవం దక్కుతున్నందుకు సంతోషం.. సీఎస్కే ఐపీఎల్ విజయంపై సాక్షిమాలిక్
Sakshi Malik | రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాప్ రెజ్లర్ సాక్షిమాలిక్ (Sakshi Malik) సైతం స్పందించారు. టైటిల్ గెలుచుకున్న ధోనీ, సీఎస్కే జట్టుకు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో తమకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Sakshi Malik | రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) పై విజయం సాధించింది. కీలక సమయంలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైను గెలిపించాడు. దీంతో సీఎస్కే (CSK) జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో టాప్ రెజ్లర్ సాక్షిమాలిక్ (Sakshi Malik) సైతం స్పందించారు. టైటిల్ గెలుచుకున్న ధోనీ, సీఎస్కే జట్టుకు అభినందనలు తెలిపారు. ఇదే సమయంలో తమకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఎంఎస్ ధోనీకి, సీఎస్కే జట్టుకు అభినందనలు. కనీసం కొంతమంది క్రీడాకారులకైనా తగిన గౌరవం, ప్రేమ లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ, న్యాయం కోసం చేపట్టిన మా పోరాటం మాత్రం ఇంకా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
మరోవైపు మహిళా రెజ్లర్లపై (wrestlers) లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్ల ఆందోళన ఉధృతమవుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన రెజ్లర్లను ఆ ప్రాంతం నుంచి పోలీసులు ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా తమ మెడల్స్ను గంగా నదిలో పడేస్తామని తెలిపారు.
Congratulations MS Dhoni ji and CSK. We are happy that at least some sportspersons are getting respect and love they deserve. For us, the fight for justice is still on 😊
— Sakshee Malikkh (@SakshiMalik) May 30, 2023
Also Read..
Ravindra Jadeja | ఇదంతా ధోనీ కోసమే.. మహీ కోసం ఏదైనా చేస్తాం : జడేజా ట్వీట్ వైరల్
Bangalore | బెంగళూరులో పంక్చర్ మాఫియా ఆగడాలు.. రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్న ప్రజలు
MS Dhoni | ధోనీ మరో ఘనత.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

