Ravindra Jadeja | రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్లో చెన్నై విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్ ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans) పై విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో 10 రన్స్ అవసరమైన వేళ.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తన స్ట్రోక్‌ప్లేతో గుజరాత్‌కు షాకిచ్చాడు. కీలక సమయంలో సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైను గెలిపించాడు. దీంతో కెప్టెన్ ఎంఎస్ (MS Dhoni) ధోనీ సారథ్యంలో చెన్నై జట్టు ఐదోసారి ఐపీఎల్ కప్పును ముద్దాడింది.
ఈ నేపథ్యంలో జట్టు విజయాన్ని ధోనీకి అంకితం చేస్తూ.. జడేజా ఓ పోస్ట్ పెట్టారు. ‘ఇది కేవలం ఎంఎస్ ధోనీ కోసం మాత్రమే చేశాం. మహీ భాయ్ నీ కోసం ఏదైనా సరే..’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా, మ్యాచ్ అనంతరం జడ్డూ ఇదే విషయం గురించి మాట్లాడారు. ‘నా సొంత రాష్ట్రంలో అభిమానుల మధ్య ఐదవ టైటిల్‌ను గెలుచుకోవడం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఇది ఒక ప్రత్యేక అనుభూతి. మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన సీఎస్కే అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అపూర్వ విజయాన్ని సీఎస్కే జట్టులోని ఒక ప్రత్యేకమైన వ్యక్తికి అంకితం చేస్తున్నాం. జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసమే ఇదంతా చేశాం’ అని చెప్పుకొచ్చారు.
We did it for ONE and ONLY “MS DHONI.🏆 mahi bhai aapke liye toh kuch bhi…❤️❤️ pic.twitter.com/iZnQUcZIYQ
— Ravindrasinh jadeja (@imjadeja) May 30, 2023
Also Read..
MS Dhoni | ధోనీ మరో ఘనత.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు
Bangalore | బెంగళూరులో పంక్చర్ మాఫియా ఆగడాలు.. రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్న ప్రజలు