Encounter | ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం ఉదయం బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల (Naxalites) మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోలు హతమయ్యారు. ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు.
బీజాపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బీజాపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అండ్రి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా.. ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోలు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు.
Also Read..
Punjab Farmers: శంభూలో శిబిరాల తొలగింపు.. దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాల పిలుపు
Donald Trump | భారత్ సుంకాలు తగ్గిస్తుందని భావిస్తున్నా : డొనాల్డ్ ట్రంప్
Indian student | హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్ట్