Indian student | పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు (Hamas ties) ఉన్నాయన్న ఆరోపణలపై ఓ భారతీయ విద్యార్థి (Indian student)ని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం (Georgetown University)లో పరిశోధకుడైన భారతీయ విద్యార్థి బదర్ ఖాన్ సూరి (Badar Khan Suri) స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉంటున్నాడు.
అయితే, వర్సిటీలో అతడు హమాస్ ఉగ్రసంస్థకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీని ఊటంకిస్తూ ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఈ మేరకు సోమవారం రాత్రి వర్జీనియాలోని అతని ఇంటి వెలుపల ఫెడరల్ ఏజెంట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అతడి వీసాను కూడా రద్దు చేసినట్లు పేర్కొంది. అయితే, తన అరెస్ట్‌పై సూరి ఇమిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలున్న కారణంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని కోర్టులో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
Also Read..
Narendra Modi | మోదీ ఎవరో తెలీదు.. 70 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం ఇదే!
Israel | గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ గ్రౌండ్ ఆపరేషన్
JFK Assassination Files: జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు చెందిన 63,000 పేజీల డాక్యుమెంట్లు రిలీజ్