Narendra Modi | వాషింగ్టన్ : మెజారిటీ అమెరికన్లకు మోదీ ఎవరో తెలియదట! భారత ప్రధాని ఎవరో తెలియదని 70 శాతం మంది అమెరికన్లు తెలిపారు. యూగవ్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మరో సర్వేలో మోదీపై అభిప్రాయాలను అడిగారు. కేవలం 2 శాతం మంది మాత్రమే ఆయన పట్ల బలమైన ఇష్టాన్ని వెల్లడించారు.
11 శాతం మంది కొంత వరకు సానుకూలత ప్రకటించారు. మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చెంఘిజ్ ఖాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల కన్నా మోదీకి తక్కువ ర్యాంకు ఇచ్చారు. మహాత్మా గాంధీ పట్ల 61 శాతం మంది సానుకూలతను వ్యక్తం చేశారు. ఆయన మంచి నాయకుడని చెప్పారు. దీంతో ఆయనకు టాప్ 10లో చోటు లభించింది. మోదీ నెట్ ఫేవరబిలిటీ మైనస్ 3 లభించింది.