Israel | జెరూసలేం : ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడులు రెండో రోజు బుధవారం కొనసాగాయి. ఈ దాడుల్లో గాజా సిటీలో ముగ్గురు, బీట్ హనోన్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గాజా కారిడార్లో అత్యంత కీలకమైన కొంతభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పరిమితస్థాయి ‘గ్రౌండ్ ఆపరేషన్’ చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బందీలను హమాస్ విడిచిపెట్టకపోతే, ఊహించలేని స్థాయిలో దాడులు ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణమంత్రి హెచ్చరించారు.