లక్నో: ఇద్దరు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దానిని రికార్డ్ చేశారు. బాధిత కుటుంబం నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. (Men Rape Girl) ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గరోథా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని రికార్డ్ చేశారు. బాధిత బాలిక కుటుంబాన్ని రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని వారు బెదిరించారు.
కాగా, బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డిసెంబర్ 3న కేసు నమోదు చేశారు. నిందితులైన యువకులు గరోథా ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. శనివారం నిందితుల ఇంటిని చుట్టుముట్టారు. వారు కాల్పులు జరుపడంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు.
మరోవైపు రాంనగర్ గరౌతకు చెందిన 19 ఏళ్ల వైభవ్ పట్సారియ, 21 ఏళ్ల విశాల్ పట్సారియను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఎన్కౌంటర్లో గాయపడిన వారిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నిందితుల వద్ద అక్రమంగా ఉన్న ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read:
Navjot Kaur | రూ.500 కోట్లు ఇచ్చేవాడు ముఖ్యమంత్రి అవుతాడు: నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య
Youth jump into borewell | మొబైల్ కొనుగోలుకు నిరాకరించిన తండ్రి.. బోరుబావిలోకి దూకిన కొడుకు
Bride asks for bulb on wedding night | తొలిరాత్రి వేళ బల్బు అడిగిన వధువు.. కంగారుపడి మాయమైన వరుడు