లక్నో: ఒక కోచింగ్ సెంటర్ వద్ద పేలుడు సంభవించింది. (explosion at coaching centre) ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. మీథేన్ గ్యాస్ కారణంగా ఈ పేలుడు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఒక కోచింగ్ సెంటర్ బేస్మెంట్ వద్ద పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ పేలుడుతో స్థానికులు భయాందోళన చెందారు.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్‌లో పేరుకుపోయిన మీథేన్ గ్యాస్ కారణంగా పేలుడు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనపై స్పందించారు. దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు. మరణించిన బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
#WATCH | Uttar Pradesh: Two people died, 7 injured in a blast at a coaching centre in Farrukhabad.
Police say that the blast occurred likely due to excess concentrated methane in the septic tank located in the basement. pic.twitter.com/riakpznNrT
— ANI (@ANI) October 4, 2025
Also Read:
Man jumps Into Yamuna With Children | ప్రియుడితో పారిపోయిన భార్య.. పిల్లలతో కలిసి నదిలో దూకిన భర్త
Cow Cess On Liquor | మద్యంపై 20 శాతం ‘ఆవు పన్ను’.. బార్ బిల్లు ఫొటో వైరల్
Watch: పెళ్లిలో సోదరుడి పాత్ర పోషించిన సైనికులు.. విధుల్లో మరణించిన వధువు అన్న లోటు తీర్చారు