Road Accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు బలంగా ఢీ కొన్నాయి (Tourist Buses Collide). ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘటన లాతూర్-సోలాపూర్ హైవేపై (Latur-Solapur Highway) గురువారం ఉదయం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తుల్జాపూర్-లాతూర్ మార్గంలోని ఆశివ్ ఫాటా సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ కొన్నాయి. పూణె నుంచి లాతూర్కు వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదే మార్గంలో వెళ్తున్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మంది వరకూ గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఐదు అంబులెన్సుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం లాతూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Rajnath Singh: పీవోకే ప్రజలు స్వచ్ఛంధంగా భారత్‌కు తిరిగి వస్తారు: రాజ్‌నాథ్ సింగ్
Spying | పాక్‌కు గూఢచర్యం.. కాంగ్రెస్ నేత మాజీ పీఏ అరెస్ట్