Army jawans | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir) అనంత్‌నాగ్ జిల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు (Army jawans) కిడ్నాప్‌కు (kidnapped) గురయ్యారు. కాకర్‌నాగ్ ప్రాంతం టెరిటోరియల్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు (terrorists) ఎత్తుకెళ్లారు. అయితే, ఓ జవాన్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకోగా.. మరో జవాను కోసం పోలీసులు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా శవమై కనిపించారు.
మంగళవారం అనంత్‌నాగ్ (Anantnag) అటవీ ప్రాంతంలో అధికారులు యాంటీ – టెర్రర్ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే టెరిటోరియల్ ఆర్మీ (Territorial Army) యొక్క 161 యూనిట్‌కు చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు ఆర్మీ అధికారి ఒకరు బుధవారం ఉదయం తెలిపారు. వారిలో ఓ జవాను ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. తప్పించుకున్న సైనికుడికి రెండు బుల్లెట్ గాయాలు కూడా అయినట్లు తెలిపారు. గాయపడిన జవాన్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని సదరు అధికారి వెల్లడించారు.
మరోవైపు కిడ్నాప్‌కు గురైన మరో జవాను కోసం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టగా.. అతని డెడ్‌బాడీ దొరికటన్లు సదరు వర్గాలు తెలిపారు. మృతి చెందిన జవాను శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..
Poonam Kaur | ఆ దర్శకుడు ఒక అమ్మాయిని మోసం చేసి గర్భవతిని చేశాడు : పూనమ్ కౌర్
Speed Post | పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం.. యువకుడికి చేజారిన ఉద్యోగం