Cement Slabs | దేశంలో రైలు (Train) ప్రమాదాలకు దారి తీసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ట్రాక్‌లపై (Railway Track) గ్యాస్ సిలిండర్లు, ఇనుప పట్టీలు ఉంచూతూ రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగు చూశాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది.
రాయ్‌బరేలి (Raebareli)లోని లక్ష్మణ్పూర్లో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్ దిమ్మెలను (Cement Slabs) ఉంచారు. ఆ ట్రాక్‌పై వెళ్లిన ఓ గూడ్స్ రైలు (Goods Train) సిమెంట్ దిమ్మెలను ఢీ కొట్టింది (Collides With Cement Slabs). అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమీపంలోని పొలాల్లోనుంచి ఈ సిమెంట్ స్లాబ్‌లను తీసుకొచ్చి ట్రాప్‌పై పడేసినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
కాగా, గత మూడు నెలలుగా ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. రైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఆయా ఘటనల్లో రైలు ట్రాక్‌లపై వివిధ రకాల వస్తువులను అధికారులు గుర్తించారు. వీటిలో ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూస్తున్నాయి. ఆ తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు జరిగినట్లు రైల్వే శాఖ ఇటీవలే తెలిపింది.
Also Read..
Accident | టూరిస్ట్ వ్యాస్ - కారు ఢీ.. ఐదుగురు మృతి
liquor policy | మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
Speed Post | పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం.. యువకుడికి చేజారిన ఉద్యోగం