Accident | తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. తిరుపూర్ (Tirupur) జిల్లాలోని మతుకళం సమీపంలో టూరిస్ట్ వ్యాన్, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఓ కుటుంబం తమ బంధువుల ఇంట్లో సంతాప కార్యక్రమం కోసం పళని వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో వీరి కారును టూరిస్ట్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో టూరిస్ట్ వ్యాన్లో ఉన్న 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మడతుకులం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Haryana Vote Share: హర్యానా ఓట్ షేర్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య స్వల్ప తేడా
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి.. ట్రెండింగ్లోకి వచ్చిన జిలేబీ