Republic Day Parade | దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ (Kartavya Path)లో నిర్వహించిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ‘అనంత్ సూత్ర’ (Anant Sutra) పేరిట చేసిన చీరల (Sarees) ప్రదర్శన ఆకట్టుకుంది. దేశ నలుమూలల నుంచి తీసుకొచ్చిన 1,900 చీరలను ఇక్కడ ప్రదర్శించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకుల వెనుక భాగంలో ప్రదర్శించిన ఈ చీరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ చీరలకు QR కోడ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్‌పై స్కాన్ చేస్తే చీర ప్రత్యేకత, ఏ ప్రాంతానికి చెందిన చీర, ఎంబ్రాయిడరీ వర్క్ గురించిన వివరాలు తెలుసుకోవచ్చు.
Here’s a special look at the ‘Anant sutra- The Endless Thread’ textile installation at #KartavyaPath as a part of the 75th #RepublicDay celebrations!#CultureUnitesAll #AmritMahotsav #BharatKiNariinSaree #RepublicDay2024 pic.twitter.com/DoFQCJuFRm
— Ministry of Culture (@MinOfCultureGoI) January 26, 2024
ఇక ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో దేశంలోని కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మొత్తం 15 వందల మంది మహిళా, పురుష కళాకారులు ఈ సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలు దేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
Also Read..
Sania Mirza | విడాకుల తర్వాత.. ఆసక్తికరంగా మారిన సానియా తొలి పోస్ట్
Snowfall | ఎట్టకేలకు గుల్మార్గ్పై మంచు దుప్పటి.. శ్వేత వర్ణాన్ని సంతరించుకున్న స్కీ రిసార్ట్
Nitish Kumar | మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి నితీశ్ కుమార్.. రెండు రోజుల్లో నిర్ణయం..!