Sania Mirza | విడాకుల తర్వాత.. ఆసక్తికరంగా మారిన సానియా తొలి పోస్ట్
Sania Mirza | షోయబ్ మాలిక్ (Shoaib Malik)తో విడాకుల అనంతరం సానియా తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అద్దంలో తనని తాను చూసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేసిన సానియా.. ‘రిఫ్లెక్ట్’ (Reflect) అంటూ ఓ సందేశాన్ని నెటిజన్లతో పంచుకుంది.
Sania Mirza | పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik), భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) వివాహ బంధం ముగిసింది. ఇటీవలే ఈ జంట విడాకులు తీసుకున్నట్లు స్పష్టత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షోయబ్ ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఇక విడాకుల అనంతరం సానియా తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
అద్దంలో తనని తాను చూసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేసిన సానియా.. ‘రిఫ్లెక్ట్’ (Reflect) అంటూ ఓ సందేశాన్ని నెటిజన్లతో పంచుకుంది. అయితే, ఇక్కడ విడాకుల గురించి ఎటువంటి ప్రస్తావనా తీసుకురాలేదు. సానియా తనని తాను సమీక్షించుకుంటున్నట్లు అర్థం వచ్చేలా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడుఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సానియా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
షోయబ్ – సానియా విడిపోతున్నారంటూ గత ఏడాది కాలంగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ వార్తలపై ఇరువురూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలోనే షోయబ్.. మీర్జాతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ మరో ఇన్నింగ్స్‌కు తెరదీశాడు. మరోసారి పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. పాకిస్థాన్ ప్రముఖ సినీతారగా గుర్తింపు పొందిన సనా జావెద్‌ను శనివారం పెండ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు. సంప్రదాయ పెండ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను మాలిక్ సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.
మాలిక్‌కు ఇది మూడో వివాహం కాగా, సనాకు రెండోది. 2010లో ఆయేషా సిద్ధిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ అదే ఏడాది హైదరాబాదీ సానియాను రెండో పెండ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 2018లో కొడుకు ఇజాన్ పుట్టాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో దూరం దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం షోయబ్..ఇన్‌స్టాగ్రామ్‌లో సానియాను అన్‌ఫాలో చేయడం ఇందుకు మరింత బలాన్ని ఇచ్చింది.
Also Read..
Snowfall | ఎట్టకేలకు గుల్మార్గ్పై మంచు దుప్పటి.. శ్వేత వర్ణాన్ని సంతరించుకున్న స్కీ రిసార్ట్
Nitish Kumar | మళ్లీ ఎన్డీఏ కూటమిలోకి నితీశ్ కుమార్.. రెండు రోజుల్లో నిర్ణయం..!
Mahmood Ali | గణతంత్ర వేడుకల్లో అస్వస్థతకు గురైన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

