రాయ్‌పూర్: సుమారు 170 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో గురువారం లొంగిపోయారు. (Maoists Surrender) తమ వద్ద ఉన్న ఆయుధాలను వారు అప్పగించారు. జోనల్ ఇన్చార్జ్, మావోయిస్టు సైనిక విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ రూపేష్ కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు. మావోయిస్టులు ప్రమాదకరమైన ఉస్పారి ఘాట్ ద్వారా ఇంద్రావతి నదిని దాటి భైరామ్‌గఢ్ వైపు తరలివెళ్లారు. బీజాపూర్ చేరుకున్న తర్వాత జగదల్పూర్లో అధికారికంగా లొంగిపోయారు.
కాగా, మావోయిస్టుల లొంగుబాటు కోసం భైరామ్గఢ్ను వర్చువల్ కోటగా భద్రతా దళాలు మార్చాయి. ఉస్పారి ఘాట్ నుంచి భైరామ్‌గఢ్ వరకు ఉన్న రహదారులను 24 గంటల పాటు పర్యవేక్షించారు. సీనియర్ అధికారులు కూడా బీజాపూర్‌కు చేరుకున్నారు.
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు లొంగుబాటును ధృవీకరించారు. నక్సలిజంపై పోరాటంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. ‘నేడు ఛత్తీస్‌గఢ్‌లో 170 మంది నక్సలైట్లు లొంగిపోయారు. నిన్న ఈ రాష్ట్రంలో 27 మంది తమ ఆయుధాలను విడిచిపెట్టారు. మహారాష్ట్రలో నిన్న 61 మంది ప్రధాన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. మొత్తం మీద, గత రెండు రోజుల్లో 258 మంది వామపక్ష తీవ్రవాదులు హింసను త్యజించారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read:
Dead Pigeons In Well | బావిలో చనిపోయిన పావురాలు.. కలుషిత నీరు తాగి 60 మందికి అస్వస్థత
School Van Falls Off Bridge | వంతెన పైనుంచి పడిన వ్యాన్.. 10 మంది స్కూల్ పిల్లలకు గాయాలు
Employee Flees With Railways’ Rs 70 Lakh | రూ.70 లక్షల రైల్వే డబ్బుతో.. ఉద్యోగి పరార్