Encounter | ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం కూడా ఎదురుకాల్పులు జరిగాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్లో మొత్తం 16 మంది మావోలు హతమయ్యారు.
సోమవారం జరిగిన ఆపరేషన్లో.. ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతిచెందగా, ఓ కోబ్రా జవాన్ గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున .. మెయిన్పుర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మృతిచెందారు. దీంతో నక్సల్స్ మృతుల సంఖ్య 16కు చేరినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత జయరాం అలియాస్ చలపతి కూడా ఉన్నారు. అతడిపై కోటి రూపాయల నజరానా ఉన్నట్లు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రకీచా తెలిపారు. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన నక్సల్స్ మృతదేహాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దుల్లో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా జనవరి 19వ తేదీన కులరీఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొదలైందన్నారు. సోమవారం జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి భారీ స్థాయిలో ఫైర్ఆర్మ్స్, అమ్యూనిషన్, ఐఈడీలు, సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లు రికవరీ చేసినట్లు చెప్పారు. ఇక ఇప్పటి వరకు ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో 40 మంది నక్ల్స్ మృతిచెందారు. గత ఏడాది భద్రతా దళాలు వేర్వేరు ఘటనల్లో 219 మంది నక్సల్స్ను హతమార్చాయి.
Also Read..
Amit Shah: నక్సలిజం కొన ఊపిరితో ఉంది: కేంద్ర మంత్రి అమిత్ షా
Encounter | ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
Maha Kumbh | 8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు.. కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు