Mallikarjun Kharge | ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి (UP hospital)లో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 14 మంది చిన్నారులు హెచ్ఐవీ (HIV), హెపటైటిస్ (Hepatitis) వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనారోగ్యాలు డబుల్ అవుతున్నాయంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ధ్వజమెత్తారు.
‘సర్కారు చేసిన క్షమించరాని నేరానికి అభం శుభం తెలియని చిన్నారులు బలయ్యారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అనారోగ్యాలు డబుల్ అవుతున్నాయి. యూపీలోని కాన్పూర్‌లో గల ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియాతో బాధపడుతున్న 14 మంది పిల్లలకు హెచ్ఐవీ వ్యాధి సోకిన రక్తాన్ని అందించారు. ఈ కారణంగా ఆ పిల్లలు హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, సీ వంటి తీవ్రమైన వ్యాధులు బారిన పడ్డారు. ఈ ఘటన సిగ్గుచేటు’ అని ఖర్గే మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
डबल इंजन सरकार ने हमारी स्वास्थ्य व्यवस्था को डबल बीमार कर दिया है।
यूपी के कानपुर में एक सरकारी अस्पताल में थैलीसीमिया के 14 बच्चों को संक्रमित खून चढ़ा दिया गया, जिससे इन बच्चों को HIV AIDS और हेपेटाइटिस B, C जैसी चिंताजनक बीमारियाँ हो गई हैं।
ये गंभीर लापरवाही शर्मनाक है।…
— Mallikarjun Kharge (@kharge) October 25, 2023
కాగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లాలా లజపతి రాయ్ దవాఖానలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో 180 మంది తలసేమియా బాధితులకు రక్తమార్పిడి చేశారు. వారిలో ఆరు నుంచి 16 ఏండ్ల లోపు 14 చిన్నారులు కూడా ఉన్నారు. రక్తం ఎక్కించిన తర్వాత 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారి రక్తనమూనాలను పరీక్షించగా.. హెచ్ఐవీ, హెపటైటిస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆరుగురికి హెపటైటిస్ బీ, ఆరుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెచ్ఐవీ సోకినట్లు తేలింది.
Also Read..
Sushil Kumar Shinde | రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత
Ola Scooter | హాట్ కేకుల్లా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు.. ప్రతి 10 సెకండ్లకో బైక్
Ranbir Kapoor | సినిమాలకు లాంగ్ బ్రేక్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎందుకంటే..?