Ola Scooter | దసరా సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు (Ola Scooter) హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని విధంగా ప్రతి 10 సెకండ్లకు ఒక బైక్ చెప్పున అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఓలా సీఈవో (Ola CEO) భవిష్ అగర్వాల్ (Bhavish Aggarwal) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి 10 సెకండ్లకో వాహనం అమ్ముడుపోయినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది 2.5 రెట్లు ఎక్కువగా బైక్స్ అమ్ముడైనట్లు తెలిపారు.
కాగా, దసరా, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశీయ నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయదారు ఓలా ఎలక్ట్రిక్ భారత్ ఈవీ ఫెస్ట్ పేరుతో అక్టోబర్ 16న ప్రత్యేకమైన సేల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫెస్ట్‌లో భాగంగా స్పెషల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్, ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాటరీపై వారెంటీ పొడిగింపు వంటివి అందిస్తోంది. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు అదనపు ఆఫర్లు, తగ్గింపులను అందించింది. అక్టోబర్ 22 నుంచి 24 మధ్య 72 గంటల ఎలక్ట్రిక్ రష్ పేరుతో దీనిని నిర్వహించింది. ఈ ఆఫర్ మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది.
Our sales have gone through the roof this Dussehra and Navratri! Selling a scooter every 10 seconds right now, and almost 2.5x of last year!😀
India’s EV moment is here this festive season!#endICEage
— Bhavish Aggarwal (@bhash) October 24, 2023
Also Read..
Ranbir Kapoor | సినిమాలకు లాంగ్ బ్రేక్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎందుకంటే..?
Shraddha Kapoor | రూ.4కోట్ల ఖరీదైన కారు కొన్న సాహో నటి.. నెట్టింట ఫొటోలు వైరల్
Mukesh Ambani | దేవ్‌భూమిలో ముకేశ్ అంబానీ ప్రత్యేక పూజలు.. వీడియో