Shraddha Kapoor | బాలీవుడ్ స్టార్ నటి శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శక్తికపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస ప్రేమ కథా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఇక శ్రద్ధా నటించిన ఆషికి-2 మూవీతో ఈ బ్యూటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యింది.
కాగా, దసరా పండుగ సందర్భంగా సాహో భామ కొత్త కారును కొనుగోలు చేసింది. ఇంతకీ ఆ కారు ఏదనుకుంటున్నారు.. అత్యంత ఖరీదైన లాంబోర్గిని (Lamborghini ). లగ్జరీ కార్లను పెట్టింది పేరైన లాంబోర్గినికి చెందిన హురాకేన్ టెక్నికా (Huracan Tecnica) హై ఎండ్ మోడల్ కారును తాజాగా సొంతం చేసుకుంది. దీని ఖరీదు అక్షరాలా రూ.4.04 కోట్లు. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Fawad Ahmed | ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం.. నాలుగు నెలల చిన్నారి మృతి
Harish Rawat | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉత్తరాఖండ్ మాజీ సీఎం