Harish Rawat | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఉత్తరాఖండ్ మాజీ సీఎం
Harish Rawat | ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Uttarakhand Ex Chief ) హరీశ్ రావత్ (Harish Rawat)కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి (car accident) గురైంది.
Harish Rawat | ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Uttarakhand Ex Chief ) హరీశ్ రావత్ (Harish Rawat)కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి (car accident) గురైంది. ఈ ఘటనలో హరీశ్ రావత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
రావత్ మంగళవారం రాత్రి హల్ద్వానీ నుంచి ఉధమ్‌సింగ్ నగర్‌లోని కాశీపూర్‌కు కారులో బయలుదేరారు. బాజ్పూర్ వద్దకు రాగానే రావత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి (suffers minor injuries). మాజీ సీఎంను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రావత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదం గురించి హరీశ్ రావత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘హల్ద్వానీ నుంచి కాశీపూర్‌కు వెళ్తున్న సమయంలో నా కారు ప్రమాదానికి గురైంది. బాజ్‌పూర్‌లో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నా సహచరులు కూడా బాగానే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.
Also Read..
Fawad Ahmed | ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం.. నాలుగు నెలల చిన్నారి మృతి
Kangana Ranaut | అరుదైన గౌరవం దక్కించుకున్న కంగన.. రావణ దహనం చేసిన తొలి మహిళగా రికార్డు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

