Vladimir Putin | పుతిన్‌కు గుండెపోటు వార్తలను ఖండించిన క్రెమ్లిన్.. అధ్యక్షుడు దృఢంగా ఉన్నారంటూ స్పష్టం
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం (Health)పై మరోసారి వదంతులు షికార్లు చేస్తున్నాయి. పుతిన్ గుండెపోటుకు గురయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై క్రెమ్లిన్ స్పష్టతనిచ్చింది.
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యం (Health)పై మరోసారి వదంతులు షికార్లు చేస్తున్నాయి. పుతిన్ గుండెపోటుకు గురయ్యారంటూ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై క్రెమ్లిన్ స్పష్టతనిచ్చింది. అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆయన దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది.
ఇక ఇదే సమయంలో పుతిన్ తనలాంటి మరో వ్యక్తిని డూప్‌గా ఉపయోగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ( Dmitry Peskov) స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలే అని కొట్టిపారేశారు. 2020లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పుతిన్.. తన డూప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. అవన్నీ అవాస్తవాలే అని అప్పట్లో స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా గతంలో ఒకసారి డూప్‌ను ఉపయోగించుకున్నట్లు వివరించారు.
కాగా, మంగళవారం రాత్రి పుతిన్ గుండెపోటుకు గురైనట్లు వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ దినపత్రిక ‘ద ఎక్స్‌ప్రెస్ యూకే’ వార్తా కథనం వెలువరించింది. అధ్యక్షుడు పుతిన్ అధికారిక భవనం మాజీ అధికారి ఒకరు నడుపుతున్న టెలిగ్రామ్ ఛానల్ (జనరల్ ఎస్వీఆర్) తొలుత ఈ విషయాన్ని పోస్ట్ చేసిందని వార్తా కథనం పేర్కొన్నది. 71 ఏండ్ల పుతిన్.. ఓ ప్రైవేట్ భవనంలో ఉండగా హఠాత్తుగా నేలపై పడిపోయారని, కను గుడ్లు రెండూ తేలేశారని, అధ్యక్షుడు కిందపడ్డ శబ్దం విని వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వచ్చారని సదరు టెలిగ్రామ్ ఛానల్ తన పోస్ట్‌లో తెలిపింది. ఈ వార్తలను తాజాగా క్రెమ్లిన్ ఖండించింది.
కాగా, గతేడాది ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) అనారోగ్యంపై రకరకాలుగా వార్తలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. పుతిన్ క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. అందుకోసం చికిత్స చేయించుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, వాటిని ఎప్పటికప్పుడు రష్యా అధికారులు ఖండిస్తూ వచ్చారు. అవన్నీ వదంతులే అని, అధ్యక్షుడు ఆరోగ్యంగా ఉన్నారంటూ రష్యా నేతలు చెప్పుకొచ్చారు.
Also Read..
China | చైనాలో మరో ఇద్దరు మంత్రులపై వేటు.. ఎందుకంటే?
Kartarpur Corridor | కర్తార్‌పూర్ కలిపింది ఇద్దరినీ.. 76 ఏండ్ల తర్వాత కలుసుకున్న అక్కాతమ్ముళ్లు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

