మాస్కో, అక్టోబర్ 24: రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండెపోటుకు గురయ్యారని బ్రిటన్ దినపత్రిక ‘ద ఎక్స్‌ప్రెస్ యూకే’ వార్తా కథనం వెలువరించింది. అధ్యక్షుడు పుతిన్ అధికారిక భవనం మాజీ అధికారి ఒకరు నడుపుతున్న టెలిగ్రామ్ ఛానల్ (జనరల్ ఎస్వీఆర్) తొలుత ఈ విషయాన్ని పోస్ట్ చేసిందని వార్తా కథనం పేర్కొన్నది.
71 ఏండ్ల పుతిన్.. ఓ ప్రైవేట్ భవనంలో ఉండగా హఠాత్తుగా నేలపై పడిపోయారని, కను గుడ్లు రెండూ తేలేశారని, అధ్యక్షుడు కిందపడ్డ శబ్దం విని వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే ఆయన వద్దకు వచ్చారని సదరు టెలిగ్రామ్ ఛానల్ తన పోస్ట్‌లో తెలిపింది.