Ranbir Kapoor | సినిమాలకు లాంగ్ బ్రేక్ ప్రకటించిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎందుకంటే..?
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor ) సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు (break from acting). ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించిన రణ్‌బీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు.
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor ) సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు (break from acting). ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించిన రణ్‌బీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలిపారు. ‘యానిమల్’ (Animal Movie) తర్వాత ఏ చిత్రానికి సైన్ చేయలేదని వెల్లడించారు. తన కూతురు రాహాతో సమయాన్ని గడపాలనుకుంటున్నానని.. అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘‘యానిమల్’ తర్వాత నేను మరే ఇతర చిత్రానికీ కమిట్ కాలేదు. కొన్ని రోజులు నా కూతురు రాహాతో గడపాలనుకుంటున్నా. నా బిజీ షెడ్యూల్ కారణంగా రాహా పుట్టిన తర్వాత తొలి నెలల్లో తనతో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయలేకపోయాను. అందుకే, ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకుని 6 నెలల పాటు ఇంట్లోనే ఉంటూ తనతో సమయాన్ని గడపాలనుకుంటున్నా’ అని వెల్లడించారు.
ఇదే సమయంలో కుమార్తె రాహా (Raha) గురించి రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘రాహా ఇప్పుడే ఇళ్లంతా తిరుగుతూ.. అన్నింటినీ గుర్తిస్తోంది. ప్రేమను వ్యక్తపరుస్తోంది. అమ్మ, నాన్న వంటి పదాలను పలికేందుకు ప్రయత్నిస్తోంది. తండ్రిగా ఈ అందమైన క్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నా. ఈ ఆరు నెలలు పూర్తిగా తనతోనే గడుపుతా’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ (Alia Bhatt )ను రణ్‌బీర్ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గతేడాది నవంబర్ 6న రాహా జన్మించింది.
అర్జున్ రెడ్డి (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం యానిమల్. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. గీతాంజలిగా ఆమె ఈ చిత్రంలో కనిపించనుంది. ఇందులో బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.
Also Read..
Mukesh Ambani | దేవ్‌భూమిలో ముకేశ్ అంబానీ ప్రత్యేక పూజలు.. వీడియో
Shraddha Kapoor | రూ.4కోట్ల ఖరీదైన కారు కొన్న సాహో నటి.. నెట్టింట ఫొటోలు వైరల్
Kangana Ranaut | అరుదైన గౌరవం దక్కించుకున్న కంగన.. రావణ దహనం చేసిన తొలి మహిళగా రికార్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

