శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 11:03:02

పది మంది పోలీస్ కానిస్టేబుల్స్ బదిలీ

పది మంది పోలీస్ కానిస్టేబుల్స్ బదిలీ

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో పది మంది పోలీస్ కానిస్టేబుల్స్‌ను బదిలీ చేశారు. కాన్పూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులకు ముందు అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తున్నారన్న సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో చౌబే‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పది మంది పోలీస్ కానిస్టేబుల్స్‌ను బదిలీ చేశారు.

కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ ఆదేశాల మేరకు చౌబే‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అందరిపైనా నిఘా ఉంచి దర్యాప్తు చేస్తున్నారు. వికాస్ దూబేకు సమాచారం అందించి సహకరించిన వారిని వదిలిపెట్టబోమని, వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ మోహిత్ అగర్వాల్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు 60కిపైగా క్రిమినల్ కేసులున్న వికాస్ దూబేను పట్టకునేందుకు 25 పోలీస్ టీమ్‌లు ప్రయత్నిస్తున్నాయి.logo