Coal Mine Collapses | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని కూలింది (Coal Mine Collapses). ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది అందులో చిక్కుకుపోయారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌గఢ్ (Ramgarh) జిల్లాలోని కర్మ ప్రాంతంలోని (Karma area) బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున సమయంలో కొందరు స్థానికులు అక్కడ అక్రమంగా బొగ్గు తవ్వకాల్లో పాల్గొన్నట్లు కుజు పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జి అశుతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఆ సమయంలో గనిలోని కొంత భాగం కుప్పకూలిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక, రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Ramban | ఒకదానికొకటి ఢీ కొన్న ఐదు బస్సులు.. 36 మంది అమర్నాథ్ యాత్రికులకు గాయాలు
snake like bridge | పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్.. భోపాల్‌లో వెలుగులోకి మరో ప్రమాదకరమైన వంతెన
Pilot Collapses | టేకాఫ్‌కు ముందు కాక్‌పిట్‌లో కుప్పకూలిన పైలట్.. షాకింగ్ ఘటన