న్యూఢిల్లీ: ఒక పోలీస్ అధికారి కొందరు కూలీలపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఒక కూలీ మరణించాడు. మరో కూలీ గాయపడ్డాడు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. (Delhi Cop Fires At Labourers) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ద్వారకాలోని జాఫర్పూర్ కలాన్ ప్రాంతంలో కొన్ని కూలీల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కొందరు కూలీలు పార్టీ చేసుకున్నారు.
కాగా, ఆ కూలీలు పెద్దగా శబ్దాలు చేయడంతో సమీపంలో నివసించే పోలీస్ అధికారి అక్కడకు వచ్చాడు. ఈ సందర్భంగా వారితో వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ పోలీస్ అధికారి తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కూలీల గుంపుపై కాల్పులు జరిపాడు. ఇద్దరు కూలీలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఒక కూలీ మరణించాడు.
మరోవైపు కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీలపై కాల్పులు జరిపిన తర్వాత పారిపోయిన పోలీస్ అధికారి కోసం బృందాలు వెతుకుతున్నాయని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Watch: రాహుల్, అఖిలేష్ దిష్టిబొమ్మల దహనం.. బీజేపీ మహిళా ఎమ్మెల్యేకు కాలిన గాయాలు
Watch: దేవుడి ఊరేగింపు సందర్భంగా కూలిన వంతెన.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch| రోడ్డుపై చెల్లాచెదురుగా కరెన్సీ నోట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?