e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు మాగనూరులో తొలి కొవిడ్‌ దవాఖాన

మాగనూరులో తొలి కొవిడ్‌ దవాఖాన

మాగనూరులో తొలి కొవిడ్‌ దవాఖాన

టీటా, ఏటీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఆన్‌లైన్‌లో ప్రారంభించిన ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌
త్వరలో రాష్ట్రమంతటా అమలు

మహబూబ్‌నగర్‌, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కృష్ణ : కరోనా రక్కసితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న గ్రామీణులకు స్థానికంగా వైద్యం అందించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా), అమెరికన్‌ తెలంగాణ సొసై టీ (ఏటీఎస్‌) సంయుక్తంగా ముందుకొచ్చాయి. కొవిడ్‌ దవాఖాన పేరిట వైద్య సేవలు ప్రారంభించా యి. కరోనా వ్యాధిగ్రస్తులు చికిత్స పొందేందుకు టీ టా ఆధ్వర్యంలో గతేడాది టీ కన్సల్ట్‌ పేరిట మొబైల్‌ యాప్‌ ద్వారా వైద్య సేవలందించారు. వీటికి కొనసాగింపుగా ఏటీఎస్‌ సహకారంతో క్షేత్రస్థాయిలోనే తొలి కొవిడ్‌ దవాఖానను నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం కొవిడ్‌ దవాఖానను ప్రారంభించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఆన్‌లైన్‌ ద్వారా సేవలు ప్రారంభించారు. ఇలాంటి వైద్య సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మే లు చేస్తాయని ఆయన ప్రశంసించారు. టీటా చే స్తున్న కృషి వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నారాయణపేట కలెక్టర్‌ హరిచందన హాజరయ్యారు.

ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి దవాఖాన నారాయణపేట జిల్లాలో ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. టీటా, ఏటీఎస్‌ను అభినందించారు. ఇక్కడి కొవిడ్‌ దవాఖాన మాదిరిగా త్వరలో రాష్ట్రమంతటా ఏర్పాటు చేయనున్న ట్లు టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ మక్తాలా తెలిపారు. మాగనూరు, పరిసర ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌, రాయిచూరు వెళ్లేవారని, అన్ని అంశాలను అధ్యయనం చేసి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ దవాఖాన ద్వారా అంతర్జాతీయ వైద్యుల సేవలతో స్థానికంగా చికిత్స పొందేలా చేస్తున్నామన్నారు. ఈ కొవిడ్‌ దవాఖానలో మాగనూరు మండలంలోని 9 హెల్త్‌ సబ్‌ సెంటర్లలో స్థానికులు పాల్గొని ఆన్‌లైన్‌ విధానంలో వైద్యుల ద్వారా కొవిడ్‌ వైద్యానికి సంబంధించిన సలహాలు పొందారు.
కొవిడ్‌ దవాఖాన పనితీరు ఇలా..
సంప్రదాయ వైద్య సాయం రూపంలోనే ఆ న్‌లైన్‌లో కొవిడ్‌ కన్సల్టేషన్‌ జరుగుతుంది. పీహెచ్‌సీలో కొవిడ్‌ నిర్ధారణ అయిన వారికి ఇక్కడ వైద్య సాయం వీడియో కన్సల్టింగ్‌ రూపంలో అందిస్తారు. ఇందుకోసం టీ కన్సల్ట్‌ టెక్నాలజీ సాయం వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్‌ కొవిడ్‌ కన్సల్టేషన్‌కు సంబంధించిన ఆర్థిక, వైద్య సంబంధమైన సాయం అమెరికన్‌ తెలంగాణ సంఘం అందిస్తోంది. ఇద్దరు వై ద్యులు ఈ సెంటర్‌కు వచ్చే రోగులకు సాయంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు. ఇద్దరు హెల్త్‌ వలంటీర్లు ఈ కేంద్రంలో ఉండి సేవలు అందించనున్నారు. టీటా తన యొక్క టీ కన్సల్ట్‌ టెక్నాలజీని, క్షేత్రస్థాయిలో నిర్వహణ చూస్తుంది. మాగనూరులో ఈ మోడల్‌ విజయవంతమైతే వెంటనే రాష్ట్రమంతటా ఈ సేవలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అమెరికన్‌ తెలంగాణ సంఘం తరఫున చైర్మన్‌ కరుణాకర్‌ మాధవరం, ప్రెసిడెంట్‌ నరేందర్‌ చీమెర్ల, కొవిడ్‌ దవాఖాన ప్రోగ్రాం అడ్వైజర్‌ డాక్టర్‌ దిలీప్‌ బీరెల్లి, తాజా మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, జనరల్‌ సెక్రటరీ వెంకట్‌ మంతెన, ఇతర కార్యవర్గ సభ్యులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీటా తరఫున సందీప్‌ కుమార్‌ మక్తాలా, రాణాప్రతాప్‌ బొజ్జం, శ్రీకాంత్‌ , ఇలియా స్‌ , సౌమ్య , శ్రావణి, బస్వరాజ్‌, హారికా మోటార్‌, రాకేశ్‌ పూజారి, పవన్‌ కల్యాణ్‌, సుమంత్‌, విశాల్‌, డాక్టర్‌ శ్రీమంత్‌ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాగనూరులో తొలి కొవిడ్‌ దవాఖాన

ట్రెండింగ్‌

Advertisement