e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు సమన్వయంతో పని చేయాలి

సమన్వయంతో పని చేయాలి

సమన్వయంతో పని చేయాలి

అధికారులు,ప్రజాప్రతినిధులు సమిష్టిగా ముందుకు సాగాలి
మండల సర్వసభ సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

బాలానగర్‌, జూన్‌ 4 : అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం తో పని చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కమల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామా ల్లో చేపడుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో కరెంట్‌ సరిగా ఉండటం లేదని స ర్పంచులు ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్‌ సరఫరాలో సమస్యలు లేకుండా చూడాలని ఏఈని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గ్రా మాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. అనంతరం వివి ధ గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ చెక్కులను అందజేశారు. వ్యవసాయం, ఐసీడీఎస్‌, ఈజీఎస్‌,పలు శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల వివరాలను అధికారులు చదివి వినిపించారు. సమావేశంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్ల ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ కల్యాణి, జెడ్పీ సీఈవో జ్యోతి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకటాచారి, ఎంపీడీవో కృష్ణారావు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమన్వయంతో పని చేయాలి

ట్రెండింగ్‌

Advertisement