ప్రశ్నించే గొంతుకను గెలిపిద్దాం
పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపింపించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్లోని మైసమ్మ మందిరం, కెనాల్ కట్ట వద్ద బాజిరెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
- బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని ఆశీర్వదించండి..
- అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
- నగరంలోని 37వ డివిజన్లో ఎన్నికల ప్రచారం
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 26: పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపింపించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్లోని మైసమ్మ మందిరం, కెనాల్ కట్ట వద్ద బాజిరెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాముడు కోసం లక్ష్మణుడిలా నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రశ్నించే గొంతుకను గెలిపించుకోవడమే లక్ష్యమని, బాజిరెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధి కేసీఆర్ హయాం లో పదేండ్లలో జరిగిందని గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్, సాగునీరందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుమని పది రోజులు కాక ముందే కరెంట్ కట్చేస్తున్నదని విమర్శించారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రచారంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, డివిజన్ అధ్యక్షుడు ప్యాట సంతోష్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్ ఠాగూర్, సత్యప్రకాశ్, నరేశ్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

